calender_icon.png 8 February, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూ పరిపాలన భవనం ఎదుట విద్యార్థుల ఆందోళన

08-02-2025 01:38:19 AM

హైదరాబాద్‌సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(విజయక్రాంతి) : ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట ఓయూ విద్యార్థులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు.

ఈ నెల 17నుంచి జరగాల్సిన పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ పరిపాలనా భవనం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 28న నెట్ పరీక్ష ఉందని ఆ పరీక్ష పూర్తయ్యాక సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా పరీక్షల తేదీలను ప్రకటించిన అధికారుల వైఖరికి నిరసనగా ధర్నా  చేసినట్లు పేర్కొన్నారు.