13-03-2025 01:29:34 PM
400 ఎకరాల భూమిని అమ్మకాల్ని నిరసిస్తూ క్యాంపస్ ఎదుట విద్యార్థుల ఆందోళన
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): హెచ్‌సీయూ క్యాంపస్( Hyderabad Central University lands) పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. రేవంత్ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ, ఖబర్ధార్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ ప్లకార్డులు చేతబూని విద్యార్థులు నినాదాలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెట్టడంపై విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హెచ్ సీయూ భూముల అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.