31-03-2025 12:53:12 AM
చొక్కాలు చించి.. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..
హెచ్‌సీయూ భూములు టీజీఐఐసీకి ఇవ్వద్దని విద్యార్థుల నిరసన..
ఈస్ట్ క్యాంపస్ వద్ద చదును చేస్తున్న జేసీబీలను అడ్డుకున్న విద్యార్థులు..
విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 30 (విజయక్రాంతి): హెచ్‌సియు భూములను ఇతరులకు కేటాయించొద్దని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌సియుకు చెందిన 400 ఎకరాల భూమిని టిజిఐఐసికి అప్పగించడంతో అధికారులు ఆ భూమిని చదును చేసేందుకు ఆదివారం ప్రయత్నించారు. దీంతో విద్యార్థులు మధ్యాహ్నం అక్కడికి వెళ్లి ఆ భూమిని చదును చేస్తున్న జెసిబిలను అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా పోలీసులు. విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో విద్యార్థులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో తరలించారు. పలువురు విద్యార్థుల చొక్కాలు చింపి, విద్యార్థినుల జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి మరి పోలీసులు అరెస్టు చేయడం పట్ల హెచ్సీయూ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల పోలీసులు కర్కషంగా వ్యవహరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అది ప్రభుత్వ భూమి అని అక్కడ అభివృద్ధి పనులు చేయబడితే పర్యావరణం నాశనం అవుతుందని, నిరాశ్రయం అవుతాయని అన్నారు. ఉపసంహరించుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. రాత్రి హెచ్ సి యు వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
హెచ్‌సియు విద్యార్థులపై పోలీసులు దాడి చేసిన విషయాన్ని ఏబీవీపీ నాయకులు కేంద్రమంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. హెచ్సీయును కాంగ్రెస్ ప్రభుత్వం బ్రష్టు పార్టీస్తోందన్నారు. పోలీసులు విద్యార్థులపై ఇష్టానుసారంగా దాడి చేస్తారా అని ప్రశ్నించారు. హెచ్ సి యు భూముల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసులు దాడి చేయడానికి ఎస్‌ఎఫ్‌ఐ పిడిఎస్యు రాష్ట్ర కమిటీలు ఖండించాయి. విద్యార్థులపై దాడి, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా ఏడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.
రాష్ట్రంలో పెరిగిన అణచివేత ధోరణి: కేటీఆర్
రాష్ట్రంలో ప్రభుత్వ అణచివేత విపరీతంగా పెరిగిపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హెచ్‌సీ యూ భూములను వేలం వేయడాన్ని నిరసి స్తూ ఆదివారం ఆందోళన చేస్తున్న విద్యార్థులతో పాటు జర్నలిస్టులనూ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కేటీఆర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ను, భావప్రకటన హక్కుని అణచివేస్తున్న తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఈ అరాచకత్వానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆయన దేశంలోని ప్రతీ పట్టణానికి వెళ్లి ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు ఇస్తారని.. కానీ తెలంగాణలో తమ సొంత పార్టీ పాలనలో జరుగుతున్న అరాచకత్వంపై ఎందుకు మౌనంగా ఉన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలను ఇప్పటికైనా పక్కనబెట్టి, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాస్వామిక పాలన చేసేలా తమ పార్టీకి ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ రాహుల్ గాంధీకి సూచించారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులతో పాటు జర్నలిస్టులను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులపై లాఠీచార్జీ అమానుషం
హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): హెచ్‌సీయూ భూముల వేలం వేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన చేపట్టగా.. వారిపై లాఠీచార్జి చేసిన పోలీసుల తీరు ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేంద్ర మం త్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. హాస్టల్ రూముల్లోకి వెళ్లి విద్యా ర్థులపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. పలువురు విద్యార్థులను లాక్కె ళ్లి వ్యాన్లలోకి ఎక్కించి అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఏబీవీపీ విద్యార్థి నాయకులు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. విద్యార్థులపై లాఠీచార్జి చేయ డం అమానుషమని ఆయన పోలీసులపై మండిపడ్డారు. ప్రభుత్వ భూము లను తెగనమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా.. భావితరాలకు గజం జాగా కూడా మిగిల్చరా అని అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పోలీసులతో భయపెట్టించి కాంగ్రెస్ పాలన చేయాలనుకుం టోందని ధ్వజమెత్తారు. వర్సిటీ భూములకే రక్షణ లేకపోతే ఎలా అని నిలదీ శారు. ప్రతిష్ఠాత్మక వర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని, హెచ్‌సీయూ భూముల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, తక్షణమే అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలలని డిమాండ్ చేశారు.