కోనరావుపేట, డిసెంబర్ 28 : మండలం లోని మామిడిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పంట పొలాలను సందర్శించారు. ప్రతి ఏడాది క్షేత్రసందర్శన లో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థులను వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లి అవగా హన కల్పించారు. అధునిక పద్ధతులతో వ్యవసాయాన్ని చేయడంతో పాటు పంట మార్పిడి, మిశ్రమ పంటలు, సంక్రమించే తెగుళ్లపై విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరిం చారు. అనంతరం విద్యార్థులు కూలీలతో పాటు వరినాట్లు వేశారు. ఇక్కడ ప్రధానో పాధ్యాయులు కస్తూరి శ్రీనివాస్, ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.