02-04-2025 11:48:45 PM
మంచిర్యాల: మంచిర్యాలలో ఫిబ్రవరి 2న నిర్వహించిన ఐఎన్టిఎస్వో (ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్) పరీక్షలో శ్రీ చైతన్య లక్ష్మీనగర్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి బహుమతులు సొంతం చేసుకున్నట్లు ఎజిఎం అరవింద్ రెడ్డి, ప్రిన్సిపాల్ అయూబ్ బుధవారం తెలిపారు. హర్షిత్ రావు (8వ తరగతి), అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి ట్యాబ్ అందుకోగా జిడ్డిగి అక్షిత (6వ తరగతి )ఆల్ ఇండియా 2వ ర్యాంక్, విద్యాశ్రీ (5వ తరగతి) 3వ ర్యాంక్, సందీప్ ఖన్నా(4వ తరగతి), మణిశ్రీ (3వ తరగతి) 4వ ర్యాంక్, సంయుక్త (3వ తరగతి), హంషుజ (4వ తరగతి) 5వ అఖిల భారత ర్యాంకులు సాధించారన్నారు. వీరిని పాఠశాల కోఆర్డినేటర్ నాగరాజు, డీన్ ప్రియాంక, ఉపాధ్యాయ బృందం ప్రశంసించారు.