25-02-2025 04:26:29 PM
మంథని (విజయక్రాంతి): ఆహా ఏమి రుచి అనరా మైమరచి... అనే సినిమా పాటను మైమరిపించేలా పలు రకాల వంటకాలను తయారు చేసి స్థానిక కృష్ణవేణీ పాఠశాలలో ప్రదర్శించారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో సుమారు 100 మంది పేరెంట్స్ వివిధ రకాల ఆధునిక, సాంప్రదాయ వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు.
విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, జంక్ ఫుడ్ తో పోశకాలున్న ఆహారాన్ని మర్చిపోతున్న ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ వంటకాల ప్రాధాన్యతను తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.