calender_icon.png 1 April, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తాచాటుతున్న గురుకుల విద్యార్థులు

31-03-2025 12:52:28 AM

వార్షిక పరీక్షల్లోనూ వందశాతం ఉత్తీర్ణత

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఆర్ ఈఐఎస్) ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు ప్రత్యేకతను సంతరించుకు న్నాయి. ఈ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చాటుతున్నారు.

నీట్, జేఈఈ మెయిన్స్, ఎప్‌సెట్ లాంటి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారు. నిరుపేద విద్యార్థులు తమకు అందుతున్న నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకొని అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ప్రణాళికాబద్ధమైన విద్యాబోధన, క్రమశిక్షణతో కూడిన చదువులను ఇక్కడి గురువులు అందిస్తుండటంతో ఉన్నత విద్య కోసం రాసే పరీక్షల్లో విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడమేగాక, వారు ఏయే అంశాల్లో వెనుకబడ్డారో గుర్తించి ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు.

పేదలకు వరంగా..

సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గానూ 1971 అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహరావు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సర్వేల్‌లో మొట్టమొదటి రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనందిస్తూ వాటి సంఖ్య 35కు చేరింది.

అంతేగాక వీటి స్ఫూర్తిగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనకబడిన తరగతులు, మైనార్టీల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పడ్డాయి. పేద విద్యార్థులకు ఇవి వరంగా మారాయి. టీఎస్‌ఆర్జేసీ సెట్  2024 ద్వారా ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలను టీఆర్‌ఈఐఎస్‌లో కల్పిస్తారు. కేవలం చదువుల్లోనే కాకుండా ఇక్కడి విద్యార్థులకు ఆటల్లోనూ తర్ఫీదు ఇస్తారు. పోటీ పరీక్షల్లోనే కాకుండా టెన్త్, ఇంటర్ పరీక్షల్లోనూ వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాయి.

ఆ బ్యూరోక్రాట్లూ ఇక్కడ చదివినవారే..

ఒకప్పుడు, నేడు తెలంగాణ ప్ర భుత్వంలో అత్యున్నత స్థాయి బ్యూ రోక్రాట్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసై టీ గురుకులాల్లో చదువుకున్నవారే. ఇక్కడ చదువుకున్న వారు చాలా మంది సివిల్ సర్వీసెస్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌తోపా టు, దేశంలోనే పేరున్న సంస్థల్లో వై ద్యులు, ఇంజినీర్లు, సైంటిస్టులు, ఇత ర రంగాల్లో నిపుణులుగా రాణించినవారే.

రాష్ట్ర ప్రభుత్వానికి సేవలం దించిన వారిలో రాష్ట్ర మాజీ డీజీపీ ఎం మహేందర్ రెడ్డి, ప్రస్తుత టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, ఆర్థి కశాఖ స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రస్తుతం రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్న సురేంద్రమోహన్, టీఎస్‌పీహె చ్‌సీఎల్ ఎండీగా పనిచేసిన బీ మల్లారెడ్డితో పాటు మరికొంత మంది ఆయా సంస్థల్లో చదువుకున్నవారే.

వివిధ సంస్థల్లో చేరిన వారి సంఖ్య

2021 15 మంది ఎంబీబీఎస్, ఒకరు బీడీఎస్, 9 మంది బీఎస్సీ అగ్రి, ముగ్గురు ఐఐటీ, ము గ్గురు త్రిపుల్‌ఐటీ, ఏడుగురు ఎన్‌ఐటీలకు ఎంపిక కాగా, 175 మంది ఇంజినీరింగ్‌లో చేరారు. అదే 2023  వచ్చే సిరికి ఎంబీబీఎస్‌లో 45, బీడీఎస్‌లో నలుగురు, బీఎస్సీఅగ్రిలో  ఒక్కరు, ఎన్‌ఐటీలో 16 మంది, ఇంజినీరింగ్‌లో 320 మంది చోటు సంపాదించారు.