calender_icon.png 13 March, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి విద్యార్థిలో అంతర్నిగూఢంగా నైపుణ్యాలు దాగి ఉంటాయి

13-03-2025 04:39:09 PM

సైకాలజిస్ట్ బొల్లంపల్లి సత్య ప్రకాష్

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): ప్రతి విద్యార్థిలో అంతర్నిగూఢంగా అనేక నైపుణ్యాలు దాగి ఉంటాయని, వాటిని సరైన రీతిలో బహిర్గత పరచడానికి మెంటార్ సైకాలజిస్టుల సహకారం అవసరమవుతుందని, విద్యార్థులందరూ తమ అంతర్గత నైపుణ్యాలను మెరుగుపరచుకొని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ప్రముఖ సైకాలజిస్టు, గ్రాఫాలజిస్టు, మోటివేషనల్ స్పీకర్, సాఫ్ట్ స్కిల్స్ అనలిస్ట్ బొల్లంపల్లి సత్య ప్రకాష్ అన్నారు.  గురువారం పిఎం శ్రీ స్కీములో భాగంగా స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన మనో విశ్లేషణాత్మక ప్రేరణ - శిక్షణ లో ముఖ్యఅతిథిగా బొల్లంపల్లి సత్య ప్రకాష్ మెంటార్, టీచర్ గా ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా బొల్లంపల్లి సత్య ప్రకాష్ మాట్లాడుతూ... ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన సైకాలజీ మోటివేషన్ క్లాసులో,పలు అంశాల గురించి వివరించడం జరిగిందని అన్నారు. గ్రాఫాలజీ గురించి సాఫ్ట్ స్కిల్స్ గురించి.. విద్యార్థులకు మూడు గంటల పాటు అవగాహన కలిగించడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థులందరూ ఉత్సాహంగా సైకాలజిస్టును పలు ప్రశ్నలు వేస్తూ, జవాబులు రాబడుతూ.. ఎన్నెన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ కె. రమా కళ్యాణి మాట్లాడుతూ... మనో విజ్ఞాన శాస్త్ర పర్యవేక్షకుల శిక్షణలో నిర్వహించిన ప్రేరణాత్మక సదస్సుల ద్వారా విద్యార్థులు ఎన్నెన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని తెలియజేశారు. ఈ  కార్యక్రమంలో లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే మహేశ్వర రావు,  జూనియర్ వైస్ ప్రిన్సిపల్ కే శ్రీ లత, ఉపాధ్యాయులు ఉమాదేవి, సరస్వతి, పుప్పాల రజిత తదితరులు పాల్గొన్నారు.