ర్యాలీ నిర్వహించిన హయత్ నగర్ జడ్పీ స్కూల్ విద్యార్థులు
ఎల్బీనగర్, జనవరి 22 : విద్యార్థులు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ రూల్స్ పాటించడం అలవర్చుకోవాలని హయత్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఇందిర, ఎంఈవో శ్రీనివాస్, పీడీ నిర్మల తదితరులు సూచించారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు 2025 పుష్కరించుకొని హయత్ నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఎంఈవో, హెచ్‌ఎం ఆధ్వర్యంలో బుధవారం మహార్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం- రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం అంటూ నినాదాలు చేస్తూ పాఠశాల ప్రాంగణం నుంచి ఎంపీడీవో ఆఫీసు మీదుగా మహా ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి , సీఐ నాగరాజు గౌడ్, ఎస్సైలు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, మోటర్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌స్పెక్టర్ అనుష తదితరులు పాల్గొన్నారు.