22-03-2025 11:39:41 PM
మెస్ శుభ్రంగా లేకపోవడంతో నిరసన..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): నగరంలోని నిజాం కాలేజీ బాయ్స్ హాస్టల్ ఎదుట విద్యార్థులు సహపంక్తి భోజనం చేసి నిరసన తెలిపారు. మెస్ శుభ్రంగా లేకపోవడం, హాస్టల్‌లో పారశుద్యం లోపించడంతో ఈ రకంగా భోజనం చేశారు. కాగా హాస్టల్‌లో పని చేసే వర్కర్లకు జీతాలు చెల్లించకపోవడంతో వారు శుభ్రం చేయడం లేదని, దీంతో విద్యార్థులు నిరసనకు దిగామని విద్యార్థులు పేర్కొన్నారు.
ఓయూ విద్యార్థులు అత్యంత ప్రజాస్వామిక వాదులు..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అసాంఘీక శక్తులు కాదని, అత్యంత ప్రజాస్వామిక వాదులని విద్యార్థి సంఘాల నాయకులు అనానరు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన భావప్రకటన హక్కును కాలరాసే విధంగా వర్సిటీ అధికారులు, ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. విద్యార్థులు ఉద్యమాలను అసాంఘీక శక్తులు అనడం సరికాదన్నారు. కార్యక్రమంలో జార్జిరెడ్డి పీడీఎస్‌యూ, ఎంఎస్‌ఎఫ్, డీబీఎస్‌ఏ, బీఆర్‌ఎస్‌వీ, టీఎస్‌పీజాక్, ఏఎంఎస్‌ఏ, టీఎస్‌ఏ నాయకులు నాగేశ్వరరావు, కొమ్ము శేఖర్, జంగిలి దర్శన్, జీడిఅనిల్, వలిగొండ నర్సింహ, నామ సైదులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.