* అంతంతమాత్రం అడ్మిషన్లతో ప్రభుత్వ కాలేజీలు వెలవెల
* ప్రైవేటు కాలేజీల్లో డబుల్ అడ్మిషన్లు
* ఇంటర్మీడియట్ బోర్డు గణాంకాల్లో వెల్లడి
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): ఇంటర్ చదివేందుకు ప్రభుత్వ కళాశాలల కంటే, ప్రైవేటు కళాశాలల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రైవేటులో చదివించేందుకే ఇష్టపడుతున్నారు. ప్రైవేటు కాలేజీల్లో నమోదవుతున్న అడ్మిషన్ల సంఖ్యే అందుకు నిదర్శనం.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ ఇంటర్మీడియట్ కాలేజీలు 1,771 ఉండగా, వాటిలో 3,15,809 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ కాలేజీలు 1,257 ఉండగా, వీటిలో 6,23,993 మంది చదువుతున్నారు. ‘యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే సంస్థ ఇంటర్ బోర్డుకు సమా చార హక్కు చట్టం కింద వివరాలు కోరగా.. ఈ గణాంకాలన్నీ బయటపడ్డాయి. రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల కంటే ప్రైవేట్ కాలేజీలే తక్కువగా ఉన్నప్ప టికీ.. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు తక్కు వగా ఉండ డం గమనార్హం.
రాష్ట్రప్రభుత్వం సర్కార్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల కోసం రూ.కోట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ, కాలేజీల్లో విద్యా ప్రమాణాలు అనుకున్న స్థాయిలో లేకపోవడమే అడ్మిషన్లు తగ్గడానికి గల కారణం. ఈ సందర్భంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు ఎందుకు తక్కువగా నమోదవుతున్నాయ నే విషయాన్ని ప్రభుత్వం అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు.
మౌలిక వసతులు కల్పించాలని, అధ్యాపకుల కొరతను తీర్చి, విద్యార్థులకు నాణ్యమై న విద్య అందిస్తామనే భరోసా కల్పించా లని విజ్ఞప్తి చేశారు. అలా చేయనంత వరకు తల్లిదం డ్రు లు తమ పిల్లలను ప్రైవేటు కళాశాలలకే పంపిస్తారని అభిప్రాయపడ్డారు.
కాలేజీల్లో అడ్మిషన్ల వివరాలు
క్యాటగిరీ కాలేజీల సంఖ్య అడ్మిషన్లు
ప్రభుత్వం 1,771 3,15,809
ప్రైవేటు 1,257 6,23,993