calender_icon.png 19 November, 2024 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేండ్ల కాలం విద్యార్థులు నష్టపోయిండ్రు

09-11-2024 04:57:29 PM

అధికారంలోకి వచ్చిన వెంటనే 11 వేల పైచిలుకు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశాం 

ఉర్దూ దినోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): గడచిన పదేండ్ల కాలం విద్యార్థులు ఎంతో విలువైన కాలాన్ని నష్టపోయారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సముదాయం నందు  ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉర్దూ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత పది సంవత్సరాలుగా విద్య వ్యవస్థకు ఎంతో తీవ్ర నష్టం జరిగిందని, ఉపాద్యాయ నియామకాలు చేయకపోవడం చేత పది సంవత్సరాల విలువైన కాలాన్ని విద్యార్థులకు నష్టం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 11 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ పునరుజ్జీవనం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక సంఖ్యలో పేద మధ్యతరగతి విద్యార్థులే ఎక్కువగా చదువుకుంటారనీ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారు మంచి లక్ష్యాలను సాధించడానికి మీరు తర్ఫీదు ఇవ్వాలని ఆయన సూచించారు. అనంతరం ఉర్దూ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఉర్దూ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఖాజా కుతుబుద్ధిన్, షకీల్ అహ్మద్, అన్సారి, మమ్మద్ నజాముద్దీన్, అబ్దుల్ సలాం ఖాన్, నీయీం సిద్ధికి, ఎయంఓ దుంకుడు శ్రీనివాస్, గట్టు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.