10-03-2025 12:45:11 AM
నాగల్ గిద్ద, మార్చి 9 : సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ఉన్నత పాఠశాల నాగల్ గిద్దలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శంకర్, బాబుశెట్టి, ఎంఈఓ మన్మధ కిషోర్, ఎంపీడీవో మహేశ్వర రావు, ఎస్త్స్ర సాయిలు ఉపాధ్యాయులు విజయేందర్ రెడ్డి జ్యోతి మారుతి కాశీరాం మల్లీశ్వరి శివశంకర్ నాగనాథ్ విట్టల్ సంగమణిలు పాలుపంచుకున్నారు. ఎంపీడీఓ మహేశ్వర రావు మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన కాంపౌండ్ వాల్ గ్రామస్తులు ముందుకు వచ్చి నిర్మాణ పనులు చేపడితే మంజూరు చేస్తామని తెలిపారు.
మండల విద్యాధికారి మన్మధ కిషోర్ మాట్లాడుతూ మంచి అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి ఈ గ్రామ ప్రజలు విద్యార్థులను ప్రయివేట్ పాఠశాలలకు పంపి డబ్బులు వృథా చేసుకోకుండా మీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కై ప్రభుత్వ పాఠశాలకు పంపాలని సూచించారు . విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ పట్టుదలతో పైకి ఎదగాలని సూచించారు, విద్యార్థులు కలిసిపోయి విద్యార్థులను ఉత్సాహ పరిచి కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగించిన ఉపాధ్యాయుడు విజయేందర్ రెడ్డిని ప్రత్యేకంగా కొని ఆడారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సంజీవ్ పటేల్ గారు గ్రామంలోని వివిధ యువజన సంఘాల నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు వివిధ ఉపాధ్యాయ సంఘాలు సంఘ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.