బండారుపల్లిలో ఘటన
జయశంకర్ భూపాలపల్లి (ములుగు), ఆగస్టు 2 (విజయక్రాంతి): ములుగు జిల్లా బండారుపల్లి గురుకుల పాఠశాలలో విషపురుగు కరవడంతో నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి ఒకరిని విషపురుగు కుట్టడంతో అస్వస్థ తకు గురికాగా ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం మరో ము గ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారి ని కూడా ఎంజీఎంకు తరలించారు.
ములుగు మండలం పందికొండకు చెందిన శ్రీకర్, గోరికొత్తపల్లికి చెందిన ప్రణయ్, వెంకటాపూర్ మండలం కేశవాపూర్‌కు చెందిన కార్తీక్‌తో పాటు మరో విద్యార్థి ఆసుపత్రిలో చికి త్స పొందుతున్నారు. విద్యార్థుల నోటి నుం చి నురుగలు రావడంతో విషపురుగు కాటు వేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే డ్రగ్స్ తీసుకున్నా ఇలాంటి పరిస్థితులే ఏర్పడుతాయని వైద్యులు పేర్కొనడం కలకలం రేపుతోంది. దీంతో గురుకుల పాఠశాలలో ఏంజరుగుతోందనే భయం విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది. అధికారులు విచారణ చేపట్టారు.
తరగతి గదిలో పాము
ఆదిలాబాద్(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గం ప్రభుత పాఠశాలలోని ఓ తరగతి గదిలో శుక్రవారం పాము వచ్చింది. 2వ తరగతి గదిలో బీరువాపై పాము కనబడటంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. స్కూల్ సిబ్బంది గ్రామస్థులకు సమాచారం ఇవడంతో ఓ వ్యక్తి వచ్చి పామును చంపి, బయటకు తీసుకెళ్లాడు.
కొత్తగూడెం ఏటీఎంలో కట్లపాము
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ సమీపంలోని బ్యాంకు ఏటీఎంలో శుక్రవారం కట్లపాము కలకలం రేపింది. ఏటీఎంలో నగదు అయిపోవడంతో బ్యాంకు క్యాషియర్ మూర్తి నగదు లోడ్ చేసేందుకు వెళ్లారు. ఏటీఎం మిషన్‌ను తెరవగా లోపల పాము తారసపడింది. స్నేక్‌క్యాచర్ మహేష్‌కు సమాచారం ఇవ్వడంతో బృందంతో వచ్చి పామును పట్టుకుని, అడవిలో వదిలివేశారు. ఏటీఎంకు వచ్చిన వినియోగదారులు పామును చూసి భయాం దోళనకు గురయ్యారు.