calender_icon.png 29 April, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే పాఠశాల నుండి 17 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపిక

25-04-2025 02:38:37 AM

  1. పాఠశాలలో అందరూ మహిళా టీచర్లే 

జిల్లాలోనే రెండవ స్థానంలో బుద్దారం ప్రాథమిక పాఠశాల

ఒకే పాఠశాల నుండి 17 మంది విద్యార్థులు గురుకుల కు ఎంపిక  

గోపాలపేట ఏప్రిల్ 24: బుద్ధారం ప్రాథమిక పాఠశాల నుంచి 17 మంది విద్యార్థులు గురుకులకు ఎంపిక కావడం ఆశించదగ్గ విషయం  గోపాలపేట మండలంలో ఏ పాఠశాల నుంచి ఇలాంటి విద్యార్థులు ఉత్తీర్ణులు కానీ దీనికి కారణం మహిళా టీచర్లే ఈ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల నుంచి స్టాప్ మొత్తం మహిళా టీచర్లు ఉండడం గొప్ప విషయం.

ఆ టీచర్ల సంకల్పంతో మంచి శిక్షణ ప్రతిభను కనబరిచి విద్యార్థులను గురుకులకు ఎంపిక అయ్యేలా తీర్చిదిద్దారు. ఈ పాఠశాల వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం గ్రామ నడిబొడ్డున ఉన్న ప్రాథమిక పాఠశాల. ఈపీఎస్ పాఠశాలలో నాలుగు వ.తరగతి విద్యార్థులు 17 మంది గురుకులకు పోటీ పడగా 17 మంది కూడా ఎంపిక కావడం పలువురితో అభినందనలు కురిసాయి

ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ. గతంలో ఎన్నడూ లేని విధంగా గోపాలపేట మండలం బుద్ధారం ప్రాథమిక పాఠశాలలో 2024-25 సంవత్సరంలో కొత్తగా బదిలీలో భాగంగా అందరూ మహిళలే రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ  పాఠశాలను తన సొంత ఇంటిలా, విద్యార్థులను తన బిడ్డలలా చూసుకుంటూ విద్యార్థులకు చక్కటి బోధనను కల్పించారన్నారు.. 

గురుకుల పాఠశాలకు విద్యార్థులకు ఎంపిక కావడానికి ఎన్నో రాత పరీక్షలు నిర్వహించారన్నారు... వారికి సరైన విద్యను అందించి ప్రభుత్వం నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షలో పాల్గొనేలా చేసి 17 మంది విద్యార్థులను ఎంపికయ్యేలా పాఠశాల ఉపాధ్యాయులు తోడ్పాటయ్యారని ఆయన అన్నారు... ఈ సంతోషంలో తమ పిల్లలకు చదువు చెప్పి గురుకులాలకు ఎంపిక చేసినందుకు గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల బృందానికి శాలువాలతో సన్మానం చేశారు...

ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. వనపర్తి జిల్లాలోనే గురుకులాలకు ఎంపికలో బుద్దారం ప్రాథమిక పాఠశాల రెండవస్థానం దక్కించుకుందన్నారు.. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ, అనిత,నాగలక్ష్మి,సునిత,యాదమ్మ, కృష్ణ మరియు అంగన్వాడీ టీచర్లు ఆయాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.