calender_icon.png 26 December, 2024 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు

08-11-2024 12:09:58 AM

సూర్యాపేట/కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదర్శ క్రీడా పాఠశాలలో చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థినులు అమూల్య, ముత్తుబాయి, అనిత, మౌనిక, ఇంద్రజ, అలేఖ్య, అనలక్ష్మీ, పల్లవి రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిని వీరు ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరుగబోయే ఎస్టీఎఫ్ అండర్‌ెే14 బాలబాలికల హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్‌ఎం జంగు, జిల్లా ఆశ్రమ పాఠశాలల స్పోర్ట్స్ అధికారి మీనారెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంలలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ఎం.అఖిల్ రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జి.విద్యాసాగర్ తెలిపారు. ఎస్‌జీఎఫ్ అండర్ బాలుర హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. నేటి నుంచి పదో తేదీ వరకు రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో జరిగే పోటీల్లో అఖిల్ పాల్గొననున్నట్లు తెలిపారు.