24-03-2025 12:05:25 AM
ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు పట్టించుకోని హాస్టల్ వార్డెన్
కల్వకుర్తి మార్చి 23: కల్వకుర్తి ఎస్సీ హాస్టల్లో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ నడుస్తోంది. ఓ విద్యార్థికి చెందిన ట్రాంకు పెట్టె తాళం ధ్వంసం చేసి అందులోని సామాగ్రిని తీసినట్లు తోటి విద్యార్థులతో చెప్పుకున్నాడు. దీంతో అ విద్యార్థిని మరి కొందరు విద్యార్థులు గోడకేసి బాదారు. దీంతో ఎడమచేతి విరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హాస్టల్ వార్డెన్ ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్టు విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గత రెండు రోజుల క్రితం మరో విద్యార్థికి చెవికి తీవ్ర గాయమై కర్ణభేరి కూడా దెబ్బతిండని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్లోని 85 మంది విద్యార్థులకు గాను మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రం చేయకుండా హాస్టల్ పరిసరాల్లోనూ ముక్కుపుటాలాదిరే దుర్వాసన వెదజల్లుతోందని అయినా హాస్టల్ వార్డెన్ పట్టించుకోలేదని విద్యార్థులు మండిపడుతున్నారు.
పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న లోకేష్ అనే విద్యార్థి ఎస్సీహాస్టల్లో ఉంటున్నాడు. కగా తన పెట్టే తాళాన్ని ధ్వంసం చేసిన అంశంలో గొడవ రాజకుందని అయినా సంబంధిత హాస్టల్ వార్డెన్లు పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తి పరిధిలోని అన్ని హాస్టల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.