* కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో 16 మంది, సూర్యాటపేటలో 12 మంది
* పలువురు విద్యార్థులు ఆసుపత్రుల్లో చేరిక
కామారెడ్డి, జనవరి 29 (విజయక్రాంతి): భోజనం వికటించి రెండు వేర్వేరు చోట్ల 28 మంది విద్యార్థులు బుధవారం అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు వారిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సాయంత్రం వరకు 13 మంది కోలుకోగా వారిని ఇంటికి పంపారు. ము విద్యార్థులు మాత్రం చికిత్స పొందుతున్నారు. వంట ఏజెన్సీ నిర్వాహకులు మధ్యా వండే టమాట కూరలో లోపం తలెత్తడం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురై తెలుస్తున్నది.
హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత
సూర్యాపేట(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరినగర్‌లో గల గిరిజన వసతిగృహ విద్యార్థినులు 12 మంది బుధవారం అస్వస్థకు గురయ్యారు. హాస్టల్లో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విద్యార్థినులు పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఐదుగురు వాంతులు చేసుకోగా పాఠశాల హెచ్ఎం పీహెచ్‌సీకి తరలించారు.
అక్కడ నుంచి పట్టణంలో ప్రైవేటు హాస్పటల్‌కు తరలించారు. కాగా విద్యార్థులు పాఠశాల విశ్రాంతి సమయంలో అక్కడ అమ్ముతున్న సమోసాలు తినడంతో అస్వస్థతకు గురయ్యారని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శంకర్ తెలిపారు. హాస్టల్లో భోజనం వికటించడం వల్లే అస్వస్థకు గురయ్యారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉదయం కూడా కొందరు వాంతులు చేసుకున్నారని, వారికి స్థానిక ప్రభుత్వ హాస్పటల్లో చికిత్స అందిచారని తెలిపారు.