- మీకు ఏమి కాదు...
- నేనున్నానని....
- దగ్గర ఉండి పిల్లలకు ధైర్యం చెప్పి...
- మెరుగై వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన శ్రీనుబాబు
మంథని, మహదేవపూర్, డిసెంబర్ 24 (విజయ్ క్రాంతి) : అడవి ఆముదం కాయలు తిని విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు హుటాహుటిన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దావఖానకు చేరుకొని విద్యార్థులను సోమవారం రాత్రి పరామర్శించారు.
మీకు ఏమి కాదని... ధైర్యంగా ఉండండి... నేను ఉన్నానని... అవసరమైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లి దగ్గరుండి వైద్యం చేయిస్తానని విద్యార్థులకు ధైర్యం చెప్పి, శ్రీను బాబు మనోధైర్యం కల్పించాడు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.
మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం పోలంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం పాఠశాల ఆవరణలోని అడివి ఆముదం చెట్టు కాయలు తిన్న 8 మంది విద్యార్థులు అస్వస్థకు గురై వాంతులు విరేచనాలు కావడంతో వెంటనే వారిని జిల్లా కేంద్రంలోని (100 పడకల) ప్రభుత్వ ఆసుపత్రికి ఉపాధ్యాయులు తరలించారు.
ఈ సంఘటన తెలిసిన వెంటనే శీను బాబు జిల్లా ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరమర్శించి, పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించి, విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.