calender_icon.png 1 February, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14 మంది విద్యార్థులకు అస్వస్థత

01-02-2025 01:54:20 AM

* వికటించిన మధ్యాహ్న భోజనం 

* కామారెడ్డి జిల్లా దామరంచ హైస్కూల్‌లో ఘటన

కామారెడ్డి, జనవరి 31 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజనం వికటించి 14 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. రోజు మాదిరిగానే విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేశారు. కొద్ది సేపటికే కొందరు విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు.

గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండ  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. కాగా ఒక వైపు ప్రభుత్వ ఉన్నతాధి  బడిబాట, గురుకుల బాట వసతి గృహాల సందర్శన చేపట్టాలని ఆదేశించినప్పటికీ..

సంఘటన జరిగినప్పుడే హడావిడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అసమర్థతతోనే ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతన్నారు.