calender_icon.png 4 April, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్ల కోసం విద్యార్థుల నిరీక్షణ

04-04-2025 01:24:14 AM

పాఠశాల సమయం దాటినా తెరవని తలుపులు 

మెమోలు జారీ .. ఒక రోజు వేతనం నిలిపివేత

 మహబూబాబాద్ , ఏప్రిల్ 3 (విజయక్రాంతి): ఉపాధ్యాయులు సకాలంలో రాక, తరగతి గది తాళం తీయకపోవడంతో విద్యార్థులు వరండాలో నిరీక్షించిన ఘటన  మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని రాజీవ్నగర్తండాలో గురువారం చోటుచేసుకుంది.

సంబంధిత ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేయడంతోపాటు ఒకరోజు వేతనం నిలిపివేసినట్టు కేసముద్రం ఎంఈవో కాలేరు యాదగిరి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..  రాజీవ్నగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉదయం ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు బయటే నిరీక్షించారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో ఎంఈవో పాఠశాలను సందర్శించారు.

పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పద్మశ్రీ, రాజు ఆలస్యంగా విధులకు హాజరైనట్టు నిర్ధారించారు. జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్రెడ్డి సూచనల మేరకు సదరు ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేయడంతోపాటు ఒకరోజు వేతనం నిలిపివేసినట్టు ఎంఈవో తెలిపారు. ఉపాధ్యాయులు విధిగా సమయపాలన పాటించాలని, లేదంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.