calender_icon.png 25 October, 2024 | 5:56 AM

పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించాలి

29-08-2024 05:09:08 PM

విద్యార్థుల క్రీడల్లో రాణించినప్పుడే గుర్తింపు

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్

తుంగతుర్తి, (విజయక్రాంతి): పాఠశాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలని స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్  అన్నారు. మండల పరిధిలోని వెంపటి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో  పానుగంటి సుమతీ దేవి స్మారకార్థం  దాయం రాజిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు క్రీడలను ప్రోత్సహించినట్టయితే పలువురు క్రీడాకారులుగా రాణిస్తారని, స్పోర్ట్స్‌ కోటాలో వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అందుకు పోలీస్ ఉద్యోగాలలో వెంపటి గ్రామమే ఆదర్శమని అన్నారు.

విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై సైతం దృష్టి సారించాలని రెండు రోజులపాటు జరగనున్న క్రీడల్లో రాణించే విద్యార్థులకు జిల్లాస్థాయి రాష్ట్రస్థాయిలో పాల్గొనే అవకాశం లభిస్తుందని తెలియజేశారు.తొలుత జాతీయ జెండా ఎగుర వేశారు. మార్చ్‌ఫా్‌స్టలో విద్యార్థుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. క్రీడలను ప్రారంభించి విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు  పలువురిని ఆకర్షించాయి. జాతీయ నాయకుల వేషధారణలో ఉన్న చిన్నారులతో ఫోటో దిగి ఎమ్మెల్యే సందడి చేశారు. 

ఈ కార్యక్రమంలో దాయం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాయం ఝాన్సీ రాజిరెడ్డి, ఎస్జీఎఫ్ మండల కన్వీనర్ బోయిని లింగయ్య, మండల కన్వీనర్ కొండగడుపుల యాకయ్య, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, దాయం విక్రమ్ రెడ్డి,మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, జిల్లా నాయకులు నల్లు రామచంద్రారెడ్డి, పానుగంటి సుమతీదేవి కుమారులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సగ్గం నరసయ్య, మాజీ సర్పంచులు అబ్బ గాని పద్మ సత్యనారాయణ గౌడ్, నాగయ్య, తునికి సాయిలు, సింగిల్ విండో డైరెక్టర్ పులుగుజ్జ యాకయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తప్పట్ల శంకర్, చింతకుంట్ల వెంకన్న, దాసరి శ్రీను, మూరగుండ్ల వీరయ్య, పులు గుజ్జ నరసయ్య, భాష బోయిన వెంకన్న, ఉప్పుల రాంబాబు యాదవ్, ఎనగందుల మల్లేష్ నేత,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.