calender_icon.png 30 October, 2024 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల కళాశాలలో వంట పనులు చేస్తున్న విద్యార్థులు

30-10-2024 01:58:47 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని శివాలయం పక్కనగల కాసిపేట సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో అధ్యాపకులు విద్యార్థులతో పనులు చేస్తున్నారు. బుధవారం కళాశాలలో విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్న విషయం వెలుగు చూసింది. కళాశాలలో వంట సామాగ్రి మోపించడం, వంట పనులు చేపిస్తున్నారు. రోజుకొక తరగతి విద్యార్థులను వంట పనులకు కేటాయిస్తున్నారు. ప్రతినిత్యం తమతో వంట పనులు చేయించడంతోపాటు, బరువైన వంట సామాగ్రి గిన్నెలను మోయిస్తున్నారని కొంతమంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ కేర్ టేకర్ వెంకటేష్ లపై గురుకుల సంక్షేమ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.