calender_icon.png 30 November, 2024 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల సృజనాత్మకను గుర్తించాలి

29-11-2024 10:39:23 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థుల సృజనాత్మకతను ఉపాధ్యాయులు గుర్తించి వారు ఏ రంగాలలో రాణిస్తారో ఆయా రంగాల అభివృద్ధికి మార్గదర్శకత్వం కావాలని జిల్లా విద్యశాధికారి యాదయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో గత రెండు రోజులుగా జరిగిన జిల్లా స్థాయి ఇన్స్ఫర్ మాక్ 52 బాలల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమన్ని ముఖ్య అధితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు సైన్స్ లో సృజనాత్మకతో తయారు చేసిన ప్రయోగాలు అభినందనీయమని భవిష్యత్ లో విద్యార్హులు శాస్త్ర వేత్తలుగా ఎదగాలని అన్నారు. జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులు వినూత్న ప్రయోగాలు చేస్తూ జిల్లాకు పేరు తెచ్చారని వీరిని ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులు అభినందనీయులని అన్నరు.

అనంతరం విద్యార్థులకు సరిఫికెట్లు జ్ఞాపికలు డీఈఓ అందచేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులని అలరించాయి. కార్యక్రమ సమన్వయకర్తలుగా ధర్మపురి వెంకటేశ్వర్లు కాంపెల్లి ఉషన్న.ఉప్పుల నర్సింహ చారి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్, పరీక్షల సహాయధికారి మర్యాల ఉదయ్ బాబు, ఆసిఫాబాద్ ఎంఈఓ రాధోడ్ సుభాష్,సెయింట్ మేరీ ప్రిన్సిపాల్ త్రిస్య, ట్రస్మా జిల్లా అధ్యక్షులు  దెవభూషణం, కార్యనిర్వాహక కార్యదర్శి చిలుకూరి రాధాకృష్ణ చారి, ఎస్సి ఆర్పీ రాథోడ్ రవీందర్, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె జంగు, మాడవి గోపాల్, అన్ని మండలాల ఎంఇఓలు, పలు సంఘల నాయకులు పాల్గొన్నారు.