ముగ్గురు విద్యార్థులకు గాయాలు
ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు
కామారెడ్డి,( విజయక్రాంతి): ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి బైపీసీ ఎంపీసీ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థుల మధ్య చిన్న గొడవ తీవ్ర గర్షణగా మారి విద్యార్థులకు గాయాలయ్యాయి. గురుకుల పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం రగులుతున్నట్లు తెలిసింది. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు పట్టించుకోకపోవడంతో గొడవకు దారి తీసినట్లు తెలుస్తుంది. ఈ గొడవల ముగ్గురు విద్యార్థులు భయపడ్డారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడ్డ విద్యార్థులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నీల కడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘ సంఘటనపై పాఠశాల యజమాన్యం సంబంధిత అధికారులు సమగ్ర విచారణ ప్రారంభించారు.
ఈ ఘటనపై శుక్రవారం జోనల్ అధికారి ఫోరమ్స్ రాణి ఆర్డీవో మన్నే ప్రభాకర్ తాసిల్దార్ మహేందర్ సిఐ రవీందర్ నాయక్ తదితరులు పాఠశాల వద్దకు చేరుకొని విద్యార్థుల భద్రతపై సమీక్ష నిర్వహించారు. పాఠశాల యజమాన్యం విద్యార్థుల మధ్య ఈ విధమైన సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు క్రమశిక్షణ నియమాలను కఠినంగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రాథమికంగా విచారణ చేపడతామని డ్యూటీలో టైం లో ఉన్న సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థులను ఒక్కొక్కరిని పిలిచి ఘర్షణకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విచారణ చేపట్టిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.