calender_icon.png 21 September, 2024 | 12:17 PM

జూనియర్లపై బకెట్లు, ఇనుప పెట్టెలతో దాడి చేసిన సీనియర్లు

17-07-2024 01:39:41 PM

తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలోని బాలుర గురుకుల పాఠశాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి జూనియర్లపై సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. జూనియర్లను గదిలో బంధించి బకెట్లు, ఇనుప పెట్టెలతో దాడి చేశారు. సీనియర్ల దాడిలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన విద్యార్థి రాకేష్ ని ఆస్పత్రికి తరలించారు. సీనియర్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత విద్యార్థులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.