calender_icon.png 23 March, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి పొదుపుపై విద్యార్థులకు అవగాహన

22-03-2025 04:44:22 PM

శ్రీరంగాపూర్: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని తాటిపాముల గ్రామంలో యూపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం నీటి ఆవశ్యకతను వివరిస్తూ  బ్లాక్ బోర్డ్ పై చిత్రం వేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రయ్య మాట్లాడుతూ... ప్రతి నీటి బోట్టును పదిలంగా వాడుకోవాలని విద్యార్థులకు సూచించారు.  ఇంటిదగ్గర గానీ ఎక్కడైనా గాని నీటిని వృధా చేయకుండా చూసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు శేఖర్ రెడ్డి, శ్రీనివాసులు మాట్లాడుతూ... నీరు అనేది చాలా అత్యంత విలువైనదని, సమస్త జీవరాశికి నీరు అవసరమన్నారు, నీటిని వృధా చేస్తే  భవిష్యత్తులో నీరు అందక ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రయ్య, ఉపాధ్యాయులు శేఖర్ రెడ్డి, శ్రీనివాసులు, అరుణ, విద్యార్థులు పాల్గొన్నారు.