calender_icon.png 6 March, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన

05-03-2025 12:57:19 AM

నల్లగొండ, మార్చి 4 (విజయక్రాంతి) : నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ  డిగ్రీ కళాశాలలో మంగళవారం డిగ్రీ ఫైనలియర్, పీజీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలపై హాలియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హమ్మద్ హుస్సేన్ అవగాహన కల్పించారు.

పరీక్ష నిర్వహణ విధానం, చదవాల్సిన పుస్తకాలు తదితర అంశాలను కులంకశంగా వివరించారు.  కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. సముద్రాల ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బత్తిని నాగరాజు, తెలుగు విభాగాధిపతి వెల్దండ శ్రీధర్, టీఎస్‌కేఎస్ కన్వీనర్ అనిల్ అబ్రహం, గంజి భాగ్యలక్ష్మి, వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.