calender_icon.png 15 January, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి ఆదేశించారు... కాటారం తరలించారు

05-09-2024 01:37:39 PM

విద్యార్థులకు సరైన వసతులు లేవని తరలించిన వెంకటాపూర్ బిసి గురుకుల పాఠశాల

మంథని (విజయక్రాంతి): హాస్టల్లో విద్యార్థులకు సరైన సౌకర్యం లేవని హాస్టల్లో తీవ్రఇబ్బందులు పడుతున్నామని, మంథని మండలంలోని వెంకటాపూర్ బీసీ గురుకుల పాఠశాలలోని విద్యార్థులు మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి వసతులు లేని పాఠశాలను వెంటనే భూపాలపల్లి జిల్లా కాటారం కు తరలించాలని పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ను ఆదేశించడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం తరలించారు. దీంతో విద్యార్థులు మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.