calender_icon.png 2 November, 2024 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

02-11-2024 02:37:25 AM

  1. సిబ్బంది నిర్లక్ష్యమే కారణం
  2. విద్యార్థి సంఘాల అరోపణ

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు బుధవారం రాత్రి ఫుడ్ పాయిజన్ అయింది. సాయంత్రం భోజనం చేసిన విద్యార్థుల్లో 30 మంది కడుపు నొప్పితో బాధపడ్డారు.

వాంతులు, విరోచనాలు కావడంతో స్థానిక ఎన్‌ఎం పరీక్షించి, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం గురువారం 27 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఒకరిని మాత్రం చికిత్స కోసం ఆసిఫాబాద్ తరలించారు.

విద్యార్థుల అస్వస్థతకు ఫుడ్ పాయిజన్, కులుషితమైన తాగునీరు కారణమని విద్యార్థి సంఘాల నాయకులు, పాఠశాల విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తాగునీటి వాటర్ ట్యాంక్ నెలల తరబడి శుభ్రం చేయట్లేదని చెప్పారు. వంట గది పరిసరాలు అశుభ్రంగా ఉంటాయని విద్యార్థులు వాపోయారు. విద్యార్థుల బాగోగులు చూసుకోవాల్సిన వార్డెన్ హాస్టల్‌లో ఉండకుండా కాగజ్‌నగర్ నుంచి రాకపోకలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.