calender_icon.png 12 February, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల మంచి మార్కులు సాధించినప్పుడే గుర్తింపు

12-02-2025 12:00:00 AM

తుంగతుర్తి, ఫిబ్రవరి 11: పాఠశాల విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కు లు సాధించినప్పుడే గుర్తింపు లభిస్తుందని తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ తీగల కరుణ శ్రీ గిరిధర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎర్రపహాడ్ గ్రామంలోని హైస్కూల్లో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు అశోక చక్రవర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్కెట్ చైర్మన్ సహకారంతో పరీక్షా ప్యాడ్లు,పెన్నులు, స్కేలు,పెన్సిల్ పంపిణీ చేయడం జరిగింది.  ఈ కార్య క్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్,సభ్యులు మూడ్ మోహన్ నాయక్ మరికంటి అశోక్, వినోద్ నాయక్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.