18-03-2025 01:38:38 AM
అసెంబ్లీలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్, మార్చ్ 17 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో ఎలాంటి సౌకర్యాలు లేవని, ఇటీవల ఇచ్చోడ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని లాలిత్య మృతి చెందిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అసెంబ్లీలో ప్రస్తావించారు. వసతులు లేక విద్యార్థులు గోడలు దూకి ఇంటికెళ్లిపోతున్న పరిస్తులు పిల్లలు బయటివెళ్లిపోయిన పట్టించుకునే నాధుడులేడు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని వసతులు కల్పించాలని కోరారు.
అదేవిధంగా విదేశీ విద్యపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ప్రభుత్వ వైఫల్యం వల్ల19 మంది విద్యార్థులను ఈ ప్రభుత్వం ఎటు కాకుండా చేసిందన్నారు. గత ప్రభుత్వం పేద దళిత గిరిజన విద్యార్థులకు పై చదువుల కోసం ఓవరసీస్ స్కాలర్ షిప్ లు మంజూరు చేసి విదేశాలకు పంపించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం విదేశాల్లో చదువుల కోసం 25 లక్షలు ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు వారిని రోడ్డుపై వచ్చేలా చేసిందన్నారు.