ఎస్సై సతీష్...
మత్తు పదార్థాల వ్యతిరేక పోస్టర్లు విడుదల...
లక్షెట్టిపేట (విజయక్రాంతి): విద్యార్థులు,యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ యొక్క బంగారు భవిష్యత్తును, లక్ష్యాలను సాధించడం కోసం కష్టపడాలని ఎస్ఐ సతీష్ అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో యుఎస్ఎఫ్ఐ(USFI) జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మత్తు పదార్థాలను వ్యతిరేకిద్దాం.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం.. అనే నినాదంతో ఏర్పాటు చేసిన పోస్టర్ ను ఎస్ఐ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సంధర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ... యువత చేడు వ్యసనాలకు ఎల్లపుడు దూరంగా ఉండి, తమ లక్ష్యాల వేటలో ఉండాలన్నారు.
కొన్ని అనుకోని సందర్భలలో మానసిక స్థితి బాగా లేక అలవాటైన కొన్ని చెడు వ్యసనాలు మీ కుటుంభాలనే నాశనం చేసే విధంగా మారుతాయనే విషయాన్ని యువత, విద్యార్థులు గుర్తుంచుకోవాలని కోరారు. మీకు ఈ వయస్సులో అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆత్రుత ఉండటంలో తప్పు లేదు కానీ అవి మంచి విషయాల వరకే ఉండాలి తప్ప, మీ జీవితాలను, మీ లక్ష్యాలను పాడు చేసే విధంగా ఉండదని యువతకు సూచించారు. డ్రగ్స్ తీసుకున్న వారిని ప్రోత్సహించిన కఠిన మైన శిక్షలు ఉంటాయి, కేస్ లలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దాని వల్ల మీరు ఏలాంటి ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోలేరు. కాబట్టి యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.