12-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఫస్టియర్ వి ద్యార్థులు మ్యాథ్స్ పేపర్-1, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు 23 వేల మందికి పైగా విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తం 5,53 ,423 మంది అభ్యర్థులకుగానూ 5, 29,646 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
23,774 (4.29 శాతం) మంది విద్యార్థులు డుమ్మా కొట్టారు. కరీంనగర్, నిజామాబాద్‌లో ఒకటి చొప్పున, నల్గొండలో 3 మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యా యి. పరీక్షలు ప్రశాంత వాతావరణంలోనే జరిగినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.