22-03-2025 12:41:10 PM
సెలైన్ ఎక్కించి తిరిగి పరీక్ష కేంద్రానికి విద్యార్థి
పరిగి,(విజయక్రాంతి): పరీక్ష రాస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన పదవ తరగతి విద్యార్థికి సెలైన్ ఎక్కించి తిరిగి పరీక్ష కేంద్రానికి తరలించారు. దోమ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన విద్యార్థి రిషిక పరిగి మున్సిపల్ లోని జిల్లా పరిషత్ నెంబర్ టు పాఠశాలలో హిందీ పరీక్ష రాస్తుంది . ఉన్నట్టుండి కళ్ళు తిరిగి రిషిక కింద పడింది. వెంటనే విద్యార్థి రిషికను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సెలైన్ ఎక్కించి కాస్త కోలుకోగానే తిరిగి పరీక్ష రాసేందుకు తీసుకువెళ్లారు. విద్యార్థి వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.