02-04-2025 01:15:45 PM
విద్యార్థులపై విచక్షణరైతంగా లాటిచార్జ్ చేసిన పోలీసులు
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓ వైపు విద్యార్థులు, లెక్చరర్లు మరోవైపు ఆయా పార్టీల నేతలు హెచ్సీయూ వద్ద ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. బుధవారం విద్యార్థులు తిరిగి ఆందోళనలు కొనసాగించారు. గ్రూపులుగా ఏర్పడ్డ విద్యార్థులు విడతల వారిగా హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఒక్కసారిగా విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు విద్యార్థులను చితకబాదారు. ఎక్కడికి వెళ్లకుండా తాళ్లతో అడ్డుకుని వారిపై విచక్షణరాహితంగా దాడి చేశారు. దెబ్బలు తగుల్తాయో అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేశారు. పోలీసులు విద్యార్థులపై దాడి చేయడాన్ని పలువురు విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించారు.