బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బయటి వ్యక్తులు గంజాయి సేవించి విద్యార్థులపై దాడికి దిగడం పట్ల బుధవారం విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిరసన చేపట్టారు. గతంలో కూడా కళాశాల ఆవరణలో గంజాయి సేవించి ఆకతాయిలు పలు సంఘటనలకు పాల్పడిన పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడికి పాల్పడిన ఆకతాయిలపై బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బెల్లంపల్లిలో కలకలం రేపింది.