07-02-2025 12:00:00 AM
ఎల్బీనగర్, ఫిబ్రవరి 6: హోటల్ మేనుజ్‌మెంట్ కోర్సు చదు విద్యార్థి జల్సాలకు అలవాటుపడి, చే అప్పులు తీర్చడానికి దొంగగా మారి పోలీసులకు చిక్కాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఉప్పులేటి శశికుమార్(21) ఎల్బీనగర్‌లోని సూ కాలనీలో అద్దెకు ఉంటూ సమీప కళాశాలలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్నాడు.
ఈ క్రమంలో శశికుమార్ మద్యానికి బానిసై, ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. అంతకుముందు పార్ట్‌టైమ్ ఉద్యోగిగా ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేశాడు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నప్పటికీ డబ్బు మీద ఆశతో జల్సాలకు అలవాటు పడ్డాడు. డబ్బు సరిపోకపోవడంతో సులభంగా సంపాదించాలని చైన్ స్నాచర్‌గా మారాడు.
ఈ నెల 3వ తేదీన ఎల్బీనగర్‌లోని చంద్రపురి కాలనీలో వృద్ధురాలు బుర్రి రుక్మిణి(87) ఇంటి బయట ఉండగా శశికుమార్ దాడి చేసి, 10 తులాల బంగారు గొలుసును చోరీ చేశాడు. వృద్ధురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. శశికుమార్‌ను గురువారం అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వినోద్‌కుమార్ తెలిపారు.