calender_icon.png 22 April, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛ ఎగ్జిబిషన్ లో విద్యార్థి ప్రతిభ

19-04-2025 09:23:04 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): హుజురాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ ఎగ్సిబిషన్ లో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని పెద్దపాపయ్య పల్లి  ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థి కె కౌశిక్ తన ప్రతిభ తో తృతీయ బహుమతిని పొందారు. తాను రూపొందించిన హైడ్రాలిక్ విధానం ద్వారా రోడ్లు, డ్రైనేజీలు ఏక కాలంలో శుభ్రం చేసే నమూనా పరికరం పలువురి దృష్టి ని ఆకర్షించింది. విద్యార్థికి కమిషనర్ ఏం సారపు సమ్మయ్య, విద్యాధికారి జనార్ధన్ రావు బహుమతి పదం చేశారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ వి ఐ కంచి వేణు హుజురాబాద్ మండల విద్యాధికారి  భూపతి శ్రీనివాస్, పెద్దపాపయ్య పల్లి ప్రధానోపాధ్యురాలు సి హెచ్ అనురాధ, స్కూల్ అసిస్టెంట్ ఆవుల పద్మశ్రీ తోపాటుతదితరులు పాల్గొన్నారు.