తల్లిదండ్రులకు చెప్పనివ్వలేదని స్టూడెంట్స్ ఆందోళన
గువాహటి, సెప్టెంబర్ 10: అసోంలోని ఐఐటీ గువాహటిలో ఉన్న హాస్టల్ గదిలో యూపీకి చెందిన 21 ఏండ్ల స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యా సంవత్సరంలోనే ఇది నాలుగో సూసైడ్ కావడం గమనార్హం. స్టూడెంట్ మృతి పట్ల తోటి విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐఐటీలో జీవితాల కంటే గ్రేడులకే ఎక్కువ ప్రాధాన్యమని.. సదరు విద్యార్థి చనిపోయిన సంగతిని అతడి తల్లిదండ్రులకు చెప్పడానికి ప్రయత్నిస్తే..
తమ ఫోన్లు లాక్కొని సిబ్బంది అడ్డుపడ్డారని ఆరోపించారు. స్టూడెంట్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు చూశామని.. అయినా తమను లోపలికి వెళ్లనీవ్వలేదని తెలిపారు. ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నట్లు తాము గమనించిన 8 తర్వాత డెడ్‌బాడీని బయటకు తీశారన్నారు. ఇన్‌స్టిట్యూట్‌లో గందరగోళ పరిస్థితులపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కాగా విద్యార్థి మృతి పట్ల తాము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు విద్యాసంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపింది.