07-02-2025 01:27:50 AM
పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థిని తల్లిదండ్రులను ఓదార్చిన కలెక్టర్
జడ్చర్ల ఫిబ్రవరి 6 : బాలనగర్ మండల పరిధిలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నందు ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి కి చెందిన ఆరాధ్య (16) గురువారం తెల్లవారుజామున తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.
గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించి వెన్న వెంటనే ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరింత సమాచారం తెలియవలసి ఉంది.
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పాఠశాలను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఆరాధ్య మృతికి సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్చారు.