calender_icon.png 27 September, 2024 | 2:40 PM

విద్యార్థిగానే ప్రయోగాలు ప్రారంభించాలి

27-09-2024 11:31:32 AM

సిద్దిపేట (విజయక్రాంతి): విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రయోగాలు ప్రారంభించాలని (ఎన్ జిసి) నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త, జిల్లా సెక్టోరియల్ అధికారి బేతి భాస్కర్ సూచించారు. జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 150 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ఎల్ఈడి ట్యూబ్ లైట్ తయారీపై సిద్దిపేటలోని ఇంద్రనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇచ్చారు. ఎల్ఈడి ట్యూబ్ లైట్ శిక్షకులు రాజశేఖర్ విద్యార్థులకు తయారీ వినియోగం ఉపయోగం వంటి అంశాలను వివరించారు. వర్మి కంపోస్ట్ తయారీ ద్వారా కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు అనంతరం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.