calender_icon.png 10 January, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి క్రీడలకు విద్యార్థి ఎంపిక

06-12-2024 07:51:20 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న రామగిరి తనయ నవంబర్ 24న జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్ జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ అత్య పత్య ఎంపిక పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి చేస్తాయి పోటీలకు ఎంపిక అయ్యాడు. మహారాష్ట్ర షేగాన్ లో జనవరి 3,4,5 తేదీలలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం జరుగుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ దుర్గం మహేశ్వర్, ఫిజికల్ డైరెక్టర్ బోయిని తిరుపతి, అత్య పత్య జిల్లా సెక్రెటరీ బొమ్మకంటి కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.