18-04-2025 12:52:05 AM
కలెక్టర్ రాహుల్ రాజ్
మనోహరాబాద్, ఏప్రిల్ 17 : ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలలో పరిశుభ్రతతో పాటు విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు క్వాలిటీ విద్య అందేలా చూడడంతో పాటు భద్రతఫై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం మనోరాబాద్ మండలం కూచారం కేజీ.బీవీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీలో ఆర్డీవో జై చంద్రారెడ్డి, తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ నరసింహులు తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేజీబీవీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలోని వంట గదులు, వాష్ రూంలలో పరిశుభ్రతను పరిశీలించారు. స్టోర్ రూంను, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. వి ద్యార్థినిలతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. విద్యార్థినిలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తె లుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల కేర్ తీసుకోవడం జరుగుతుందని విద్యార్థినిలకు మెనూ ప్రకారం రుచి, శుచికరమైన భోజనం అందుతుందన్నారు. నాణ్య మైన గుణాత్మక విద్య అందించి విద్యార్థినులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పారు.