21-03-2025 05:11:23 PM
విద్యార్థి, యువజన సంఘాల నాయకులు
కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): విద్యారంగానికి 20 శాతం నిధులు అడిగితే అరెస్టులు చేస్తారా అంటూ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మండిపడ్డారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి(Chalo Assembly Program) వెళ్ళనున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యా రంగానికి కేవలం 7.57 శాతం మాత్రమే నిధులు కేటాయించదాన్ని నిరసిస్తూ తలపెట్టిన ఛలో అసెంబ్లీ(Chalo Assembly)ని భగ్నం చేయడానికి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని విద్యార్థి గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇదేనా ప్రజాస్వామ్య పాలన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే అరెస్టు చేసిన రాష్ట్ర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో పోరాటాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. పోలీసులు అదుపులో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి నాయకులు అయ్యూబ్ ఖాన్, మహమ్మద్ తాజ్ ఉన్నారు.