calender_icon.png 2 November, 2024 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

05-07-2024 04:19:04 PM

కరీంనగర్: జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ ల పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ విద్యార్థి యువజన నాయకులను టీజీపీఎస్సీ (తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) ముట్టడికి యత్నించిన వారిని ఎక్కడికక్కడ అడుకొని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మరియు మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, తిరుపతి నాయక్, శాతవాహన బీఆర్ఎస్వీ ఇంచార్జి చుక్క శ్రీనివాస్, పటేల్ శ్రవణ్ రెడ్డి, ఆరే రవి గౌడ్, పటేల్ సుదీర్ రెడ్డి, సోమిరెడ్డి రాజ నరేష్ రెడ్డి, కాటం సురేష్  తదితరులు అరెస్టు చేశారు.

 త్రీ టౌన్ లో బీఆర్ఎస్వీ అధ్యక్షులు బొంకూరి మోహన్ తదితరులు, వన్ టౌన్ లో బీఆర్ యూత్ అధ్యక్షులు దీకొండ కులదీప్, సాయికృష్ణ, తదితరులు అరెస్టు అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ... మమ్మల్ని అరెస్టులు చేయడానికి పెట్టిన శ్రద్ధ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పెట్టి ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు బాసటగా నిల్వాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఎంత నిర్బంధిస్తే అంత ఉవ్వెత్తున ఉద్యమం చేసి తీరతామని పునరుద్ఘాటించారు.