calender_icon.png 28 March, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదమైనా ఆగని.. పరీక్షా ప్రయాణం..!

21-03-2025 10:14:30 AM

మొఖంపై గాయాలతో 'పది'పరీక్షకు..!

విజయక్రాంతి,వైరా: ప్రమాదం జరిగినా.. ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలనే దిశగా.. ఎన్ని అవరోధాలు వచ్చినా ..పరీక్ష ప్రయాణం మాత్రం ఆపని ఆ విద్యార్థి తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఏడాదంతా చదివి తీరా  పరీక్ష రాసే సమయానికి  అనుకోని రోడ్డు ప్రమాదం జరిగినా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామం హైస్కూల్ లో  బెజవాడ ఉమేష్ చంద్ర  అనే విద్యార్థి మొఖంపై గాయాలతో  వాటిపై వేసిన కుట్లతో.. వైరా ప్రభుత్వఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద 'పది' పరీక్షకు హాజరయ్యాడు.. గాయాలు నొప్పులతో, అలసటగా ఉన్నప్పటికీ  ఆ విద్యార్థి పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపటం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది..