calender_icon.png 6 April, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హాస్టల్ నుండి విద్యార్థి అదృశ్యం

05-04-2025 08:37:08 PM

అందోల్: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం దేవనూరు గ్రామంలో గల ప్రభుత్వ వసతి గృహం (హాస్టల్) నుండి విద్యార్థి అదృశ్యం అయినా విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రేగోడ్ మండలం పెద్ద తండాకు చెందిన  మెగావత్ కుమార్ (15) దేవనూరు హాస్టల్ లో ఉండి ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు.  ఈ నెల 2 న హాస్టల్ వార్డెన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కుమారుడు హాస్టల్ లో లేడు వెళ్లి మీ బంధువుల ఇండ్లలో వెతకండి అంటూ కొంత డబ్బును వారికీ ఇవ్వడం జరిగిందని, విద్యార్థి తల్లిదండ్రులు తోటి విద్యార్థులను విచారించగా కూమర్ మార్చి 20 తేదీ నుంచి హాస్టల్ లో కనిపించడం లేదని వారు తెలిపారు, దింతో వారు వట్పల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది,విద్యార్థి తల్లిదండ్రులు బంధువులతో కలిసి హాస్టల్ ముందు ధర్నా చేస్తూ హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం తోనే తమా కుమారుడు కనిపించకుండా పోయడాని ఆరోపించారు, సిఐ అనిల్ కుమార్ వేవనూరు హాస్టల్ చేరుకొని విద్యార్థులను హాస్టల్ వార్డెన్, వాచ్ మ్యాన్ ను విచారించారు.