19-04-2025 01:50:51 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్, ఇంటర్ 1980 83 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 47 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ప్రిన్సిపల్ నరహరి మాట్లాడుతూ తమ వద్ద విద్యనేర్చిన శిష్యులు ఉన్నత స్థాయిలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమవంతుగా సమాజ అభివృద్ధి కోసం చేయూతను అందించాలని ఉద్బోధించారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, విద్యాభివృద్ధి కోసం చేతనైన సహాయం చేయాలన్నారు.
ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు శంకరయ్య, మల్లికార్జున్, చిరంజీవి, గఫార్, నరసింహారావు, రంగారెడ్డి, భాస్కర చారి లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉద్యోగ ఉపాధి తో పాటు వివిధ రంగాల్లో స్థిరపడ్డ ప్రముఖులు సుంకరి శ్రీనివాసు, శ్రీరామోజు రమేష్, గుడి బోయిన గోపీనాథ్, డోలి సత్యనారాయణ, ఆకుల రాజు, గిరిజ, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, పిడుగు నాగరాజు, బిక్షపతి, సుంకరి సుధాకర్, సమ్మెట సత్యనారాయణ, కేదాసు వాసుదేవ్, నాగేశ్వరరావు, వెంకట్రాజం, గడ్డం జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల రవీందర్, ప్రగళ్లపాటి రాజకుమార్ ప్రస్తుతం సమాజానికి శరీర దాన అవసరాలను వివరించడంతో కొందరు పూర్వ విద్యార్థులు తమ మరణానంతరం శరీరాన్ని దానం చేస్తామని అంగీకార పత్రం పై సంతకాలు చేశారు.