వికారాబాద్ రూరల్, జూలై 11 (విజయక్రాంతి): వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలకు ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురువారం బషీరాబాద్ మండల పరిధిలోని నంద్యానాయక్ తండాలో చోటుచేసుకున్నది. తెలిసిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన అవినాష్ (19) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బుధవారం తన రాత్రి స్నేహితులతో కలిసి నడుచుకుంటూ దామర్ చెడ్ వైపు వెళ్లాడు. మార్గమధ్యంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భయపడిన స్నేహితులు తండాకు వచ్చి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు.